Revanth Reddy: ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం..! 15 d ago
TG : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలో ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు. అలాగే జిల్లాలో చేపట్టబోయే మరో 3 ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనులకు సీఎం అక్కడే శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మించిన యాదాద్రి థర్మల్ ప్లాంట్ యూనిట్-2ను ప్రారంభించనున్నారు. అనంతరం నల్గొండలోని SLBC గ్రౌండ్లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు.